కార్తీక పౌర్ణమి దీపాలు
కార్తీక పౌర్ణమి రోజు తెలుగునాట అంతా ఆడవాళ్ళు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు.
అసలు, కార్తీక మాసం మొత్తం రెందు సంధ్యల్లో దీపాలు వెలిగించడానికి చాల విశిష్టత ఉంది అంటారు.
ఆ మాటకొస్తే, మన సనాతన జీవనవిధానంలో
దీపం వెలిగించడం, దీపారాధన, జ్యోతి ప్రజ్వలనికి ఒక ప్రశస్తమైన స్థానం వుంది.
ఙ్ఞానాన్ని మన పూర్వికులు జ్యోతితో నిర్వచించారు.
ఇలాంటి గొప్ప అలోచన, అలవాటు గురించి తెలిసి, దానిని కొద్దో గొప్పో తరచూ చూస్తూ ఉండి,
పుట్టినరోజు జరుపుకోడానికి దీపాలని అర్పివేయడం అనేది నేను ఎప్పుడూ జీర్ణించుకోలేని విషయం.
No comments:
Post a Comment